Debina Bonnerjee Gurmeet Choudhary Welcome Their Second Baby Girl, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Debina Bonnerjee : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్‌ నటి

Nov 12 2022 12:22 PM | Updated on Nov 12 2022 1:25 PM

Debina Bonnerjee Gurmeet Choudhary Welcome Baby Girl For 2nd Time - Sakshi

రామాయణం సీరియల్‌ నటి దెబీనా బొనర్జీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, నటుడు గుర్మీత్‌ చౌదరి తెలిపారు. రెండోసారి పేరెంట్స్‌గా ప్రమోట్‌ అయినందుకు సంతోషంగా ఉందని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కాగా ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన డెబీనా ఆతర్వాత రెండు, మూడు సినిమాల్లోనూ నటించింది.

కానీ వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా గుర్తింపు పొందింది. రామాయణం సీరియల్‌తో మరింత పాపులర్‌ అయిన డెబీనా ఈ సీరియల్‌లో రాముడిగా నటించిన గుర్మీత్‌ చౌదరినే  2011లో పెళ్లాడింది. ఈ ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన డెబీనా తాజాగా రెండోసారి బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేయడంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకంక్షలు తెలుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement