Dasara Box Office Collections Day 1 In Two Telugu States - Sakshi
Sakshi News home page

Dasara Movie Collections: అగ్ర హీరోల సినిమాలను దాటేసిన దసరా.. ఎన్ని కోట్లంటే?

Mar 31 2023 3:19 PM | Updated on Mar 31 2023 4:06 PM

Dasara Movie First Day Collections In Two Telugu States - Sakshi

నేచురల్ స్టార్ నాని,  కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం 'దసరా'.  ఈ సినిమా శ్రీరామనవమి సందర్భంగా థియటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా..  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల వర్షం కురిపించింది. 

ఆ రెండు చిత్రాలను దాటేసి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దసరా'కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా విడుదలైన మొదటి రోజే సంక్రాంతి హిట్ సినిమాలను అధిగమించేసింది. ఈ ఏడాది రిలీజైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాకు నైజాంలో 6.21 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా..  బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'కి రూ. 6.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలను దాటేసిన నాని 'దసరా'  నైజాంలో ఫస్ట్ డే రూ. 6.78 కోట్ల వసూళ్లు రాబట్టింది.

రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  రెండు రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 14.22 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్. నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసిన సినిమాగా 'దసరా' రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు రూ.38 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement