
క్రైం థ్రిల్లర్ సినిమాలను మించిన మలుపులు ప్రముఖ నటుడు దర్శన్ జీవితంలో జరుగుతున్నాయి. చిత్రదుర్గవాసి రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఆయన ప్రియురాలు నటి పవిత్రగౌడతో పాటు 15 మంది నిందితులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిలు రద్దు కావడంతో మళ్లీ చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది.
బెంగళూరు సెంట్రల్ జైలుకు దర్శన్‌ను తరలించారు. జైలులో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరుకాలేదని సమాచారం. జైలులో ఆయన రాత్రంతా మేల్కొని ఉన్నారని తెలుస్తోంది. దర్శన్ బెయిల్‌తో పాటు, పవిత్ర గౌడ బెయిల్‌ను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమెను బెంగళూరులోని మహిళా జైలుకు తరలించారు.
బెయిల్ రద్దుకాగానే నటి రమ్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చట్టం ముందు అందరూ సమానం అనే స్పష్టమైన సందేశం కోర్టు ద్వారా వచ్చింది. మన పని మనం చేయాలి. చివరిలో ఆశ, వెలుగు ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, న్యాయం అందరికీ లభిస్తుంది అని రేణుకాస్వామి కుటుంబానికి మద్దతుగా పేర్కొన్నారు.
#WATCH | Bengaluru, Karnataka | The Police arrest actor Pavitra Gowda after the Supreme Court cancelled the bail granted to her by the High Court in the Renukaswamy murder case.
Visuals from outside of Pavithra Gowda's residence. pic.twitter.com/jqf56st025— ANI (@ANI) August 14, 2025