
టాలీవుడ్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెరపై హోస్ట్‌గానూ కనిపించనున్నాడు. జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోకి యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ షో ఆగస్టు 17 నుంచి టీవీలో ప్రసారం కానుంది. ఇకపోతే జగ్గూ భాయ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు.
నా అసలు పేరు
తాజాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు, ప్రశ్నలపై స్పందిస్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో జగపతిబాబు మాట్లాడుతూ.. నా పేరు జగపతి రావు. ఇండస్ట్రీలో రావులెక్కువైపోయారని నా పేరును జగపతిబాబుగా మార్చేశారు. అలాగే అందరికీ నోరు తిరగడానికి ఈజీగా ఉంటుందని జగ్గూభాయ్‌గా మారిపోయాను.
చచ్చిపోయాననుకున్నా..
అంతఃపురం సినిమా చివరి సీన్‌లో నేను దాదాపు చచ్చిపోయాననుకున్నాను. డైరెక్టర్ కృష్ణవంశీ సీన్‌లో లీనమైపోయి కట్ చెప్పలేకపోయాడు. నిజంగానే పోయాననుకున్నాను. నా కెరీర్ మొత్తంలో అంతఃపురం క్లైమాక్సే ఫేవరెట్ షాట్. నా జుట్టుకు రంగెందుకు వేసుకోనని అడుగుతుంటారు. నాకు ఇంకా జుట్టుండమే అదృష్టం. అది సహజంగానే తెల్లబడింది. కాబట్టి దాన్నలాగే వదిలేస్తాను. సహజంగా ఉంటేనే నేను బాగుంటాను. నన్నిలాగే వదిలేయండి. నాకు పెద్దగా కోరికలేం లేవు. చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నిత్యం ప్రాణాయామం చేస్తుంటాను అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు.
చదవండి: భార్యాభర్తల కొట్లాటే 'సార్ మేడమ్'.. వచ్చేవారమే ఓటీటీలో..