
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ‘కిష్కింధపురి’ టీజర్‌ను విడుదల చేశారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీగా ‘కిష్కింధపురి’ రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజైన టీజర్ కూడా అంతే స్థాయిలో అలరించేలా ఉంది.
అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 12న విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ రెండు సినిమాలు కూడా ఫారెస్ట్ ఎపిసోడ్స్ నేపథ్యంలోనే కొనసాగనున్నాయని తెలుస్తోంది.