'కిష్కింధపురి' ట్విస్ట్‌.. సినిమా చూసిన వారి టాక్‌ ఇదే | Kishkindhapuri Movie Review: Bellamkonda Sreenivas Thrills in Gripping Horror Thriller | Sakshi
Sakshi News home page

'కిష్కింధపురి' ట్విస్ట్‌.. సినిమా చూసిన వారి టాక్‌ ఇదే

Sep 11 2025 12:32 PM | Updated on Sep 11 2025 12:49 PM

Kishkindhapuri Movie Premiere Talk

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన చిత్రం 'కిష్కింధపురి'.. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.

'కిష్కింధపురి' ప్రీమియర్షోలు సెప్టెంబర్‌ 10 హైదరాబాద్లోని AAA ముల్టీప్లెక్స్లో ప్రదర్శించారు. సినిమా చూసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడిని చెబుతున్నారు. ఫస్టాఫ్ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ను తెరపై అంతే చక్కగా చూపించారు. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్గా హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పిస్తాయి. బెల్లంకొండ శ్రీనివాస్కు ఈ జానర్ బాగా సెట్ అయిందనే చెప్పాలి. సూపర్గా నటించి మెప్పించాడు. 

అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్  స్టోరీ నేరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌండ్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కిష్కింధపూరి మిమ్మల్ని భయపెడుతూ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి మరి అలరిస్తుంది. పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా బాగుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement