
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ కౌశిక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ..' మొదటి 10 నిమిషాల తర్వాత ఆడియన్స్ ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీ వదిలేస్తాను. అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెబితే నాకు భయం వేసింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని రాత్రంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సినిమా చూశాం. అస్సలు కంగారు లేదు.. మూవీ చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. నేను ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ ఇచ్చింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు.. నన్ను నమ్మి నా ఎగ్జామ్ ఫీజ్ కట్టింది నిర్మాత సాహుకు.. వీడు గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్‌లో పాసవుడుతాడని నమ్మడం వల్లే జరిగింది. కచ్చితంగా డిస్టింక్షన్లో పాసవుతామనే నమ్మకం ఉంది' అని అన్నారు.