18న నవంబర్‌ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల | Srivari Darshan quota released on 18th November | Sakshi
Sakshi News home page

18న నవంబర్‌ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల

Aug 15 2025 6:05 AM | Updated on Aug 15 2025 6:05 AM

Srivari Darshan quota released on 18th November

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నవంబర్‌ కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం ఆగస్ట్‌ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపింది.

ఆర్జిత సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగస్ట్‌ 25న ఉదయం 10 గంటలకు..తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement