కన్నడ హీరో దర్శన్‌కు బిగ్‌ షాక్.. పోలీసుల అదుపులో నటుడు! | Actor Darshan Arrested Again In Renukaswamy Case After SC Cancels Bail | Sakshi
Sakshi News home page

Darshan: కన్నడ హీరో దర్శన్‌కు బిగ్‌ షాక్.. పోలీసుల అదుపులో నటుడు!

Aug 14 2025 4:31 PM | Updated on Aug 14 2025 5:15 PM

Actor Darshan Arrested Again In Renukaswamy Case After SC Cancels Bail

కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్కు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో దర్శన్బెయిల్ సుప్రీం రద్దు చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడను కూడా అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్రద్దు చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం వక్రబుద్ధితో సమానమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

కాగా... బెంగళూరులో జరిగిన రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, అతనితో పాటు ప్రియురాలు, నటి పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు. జూన్ 11, 2024న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడ అభిమానిగా చెప్పుకునే రేణుకస్వామి నటికి అసభ్యకరమైన సందేశాలు పంపాడని.. అతన్ని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపణలొచ్చాయి

కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడను కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది జూన్ 8న బెంగళూరులోని ఒక మురుగు కాలువలో రేణుకస్వామి మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. కేసులో ప్రధాన నిందితుడిగా ఐదు నెలలు జైలులో ఉన్న తర్వాత డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సుప్రీం బెయిల్ రద్దు చేయడంతో మరోసారి దర్శన్ను జైలుకు పంపనున్నారు.

అసలు ఏం జరిగిందంటే?
పోలీసుల అభియోగాల ప్రకారం..  చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. 2024 జూన్‌లో దర్శన్, అతని సహచరులు రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్‌లో మూడు రోజుల పాటు హింసించారు. అనంతరం అతని శవాన్ని డ్రెయిన్‌లో పడేశారు. ఈ కేసులో దర్శన, పవిత్రగౌడ, మరో 15 మంది అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో వాళ్లకు అందిన వీఐపీ ట్రీట్‌మెంట్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శన్‌ను మరో జైలుకు మార్చారు. ఆపై వాళ్లు బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement