'దాదాసాహెబ్‌ ఫాల్కే' బయోపిక్‌లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది | Dadasaheb Phalke grandson Comments On SS Rajamouli and Aamir Khan | Sakshi
Sakshi News home page

'దాదాసాహెబ్‌ ఫాల్కే' బయోపిక్‌లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది

May 17 2025 7:54 AM | Updated on May 17 2025 9:09 AM

Dadasaheb Phalke grandson Comments On SS Rajamouli and Aamir Khan

భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్‌ గోవింద్‌ ఫాల్కే) బయోపిక్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్‌ ఖాన్‌ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్‌  అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ విషయంలో రాజమౌళి టీమ్‌ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్‌ టీమ్‌ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్‌ కోసం ఆమిర్‌ మూడేళ్ల నుంచి  పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్‌ హీరాణీ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ బయోపిక్‌ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్‌కుమార్‌ హీరాణీ అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ హిందూకుష్‌ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ బాగా సెట్‌ అవుతాడు.' అంటూ ఆయన  చెప్పుకొచ్చాడు.

దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్‌ ఖాన్‌ చేస్తున్నట్లుగా   ప్రకటన వచ్చింది. అయితే, మేడ్‌ ఇన్‌ ఇండియా... ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా బయోపిక్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. వరుణ్‌ గుప్తా, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్‌ కక్కడ్‌ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్‌’ ఫేమ్‌) ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్‌డేట్‌ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్‌ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement