దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సలహా బోర్డ్ సభ్యురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త, సాంస్కృతిక రాయబారి సుధారెడ్డిని నియమితులయ్యారు. ఈమె కాకుండా బోర్డ్‌లో హిందూజా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ పి.సి. సూద్, బరోడా మహారాణి హెచ్.హెచ్. రాధికరాజే గైక్వాడ్, వి.ఎం. సల్గావ్కార్ కార్పొరేషన్ చైర్మన్ దత్తరాజ్ సల్గావ్కార్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఇండియన్ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్, దాదాసాహెబ్ ఫాల్కే ముని మనవరాలు గిరిజా ఫాల్కే మరాఠే, ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో గౌరవనీయ సాంస్కృతిక నిపుణుడు & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ భావనా మర్చంట్, సినీపోలిస్ ఇండియా ఫిల్మ్ ప్రోగ్రామింగ్ &డిస్ట్రిబ్యూషన్ హెడ్ మయాంక్ ష్రాఫ్ మరియు భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ & మాజీ సెన్సార్ బోర్డు జ్యూరీ జ్యోతి బధేకా తదితరులు ఉన్నారు.
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే వారసత్వంలో డీపీఐఎఫ్ఎఫ్(DPIFF) సలహా బోర్డ్.. సాంస్కృతిక ప్రతిష్టకు నిలయంగా ఉద్భవించింది. కళాకారులు, చిత్రనిర్మాతలు, పరిశ్రమ నాయకులను నిరంతరం గౌరవిస్తూనే సినిమా రంగంలో ప్రపంచ కేంద్రంగా భారతదేశం యొక్క స్థాయిని బలోపేతం చేస్తుంది. ఇకపోతే అక్టోబరు 29-30వ తేదీల్లో ముంబై వేదికగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులు-2025 కార్యక్రమం జరగనుంది.


