కాలిపోతున్న పత్తి పంట.. తల దించుకున్న ధనుష్‌.. మరో ప్రయోగం! | D54: Dhanush Begins Filming For Vignesh Raja, First Look Poster Out | Sakshi
Sakshi News home page

D54:కాలిపోతున్న పత్తి పంట.. తల దించుకున్న ధనుష్‌.. మరో ప్రయోగం!

Jul 10 2025 2:14 PM | Updated on Jul 10 2025 3:19 PM

D54: Dhanush Begins Filming For Vignesh Raja, First Look Poster Out

కోలీవుడ్హీరో ధనుష్వెండితెరపై మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుబేర సినిమా భారీ బ్లాక్బస్టర్హిట్ని తన ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్నటుడు.. తన తర్వాత సినిమా కోసం పూర్తి రూరల్బ్యాక్డ్రాప్కథను ఎంచుకున్నాడు. సెన్సిటివ్చిత్రాల ఫేమ్విగ్నేష్రాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు

తాజాగా ధనుష్‌ 54వ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో కాలిపోతున్న పత్తి చేనులో ధనుష్‌ తల దించుకొని ఉన్నాడు. ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే.. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ.. రైతు కష్టాలను ప్రస్తావించనుందని అనిపిస్తుంది.ఇప్పటికే వేరు వేరు జానర్స్లో నటించి అలరించిన ధనుష్‌..ఇప్పుడు పూర్తిస్థాయి ఎమోషనల్కథతో రాబోతున్నాడు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement