కాలిపోతున్న పత్తి పంట.. తల దించుకున్న ధనుష్.. మరో ప్రయోగం!
కోలీవుడ్ హీరో ధనుష్ వెండితెరపై మరో కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుబేర సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్ నటుడు.. తన తర్వాత సినిమా కోసం పూర్తి రూరల్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నాడు. సెన్సిటివ్ చిత్రాల ఫేమ్ విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ధనుష్ 54వ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో కాలిపోతున్న పత్తి చేనులో ధనుష్ తల దించుకొని ఉన్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతూ.. రైతు కష్టాలను ప్రస్తావించనుందని అనిపిస్తుంది.ఇప్పటికే వేరు వేరు జానర్స్‌లో నటించి అలరించిన ధనుష్..ఇప్పుడు పూర్తిస్థాయి ఎమోషనల్ కథతో రాబోతున్నాడు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, థింక్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.