మల్టీజానర్‌ క్లైమాక్స్‌ | Climax Movie Motion Poster release | Sakshi
Sakshi News home page

మల్టీజానర్‌ క్లైమాక్స్‌

Sep 20 2020 6:07 AM | Updated on Sep 20 2020 6:07 AM

రాజేంద్రప్రసాద్‌  - Sakshi

పొలిటికల్‌ సెటైర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘క్లైమాక్స్‌’. కైపాస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై పి.రాజేశ్వరరెడ్డి, కె. కరుణాకర్‌ రెడ్డి తెరకెక్కించారు. భవానీ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను కీలక పాత్రను పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రదర్శకుడు భవానీ శంకర్‌తో గతంలో నేను ‘డ్రీం’ అనే ౖసైకలాజికల్‌ థ్రిల్లర్‌లో నటించాను.

ఆ చిత్రం రాయల్‌రీల్‌ అనే ప్రతిష్టాత్మక అవార్డుతోపాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. కానీ, ఓ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే ఆదరించారని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్‌ సెటైర్‌.. ఇలా మల్టీజానర్‌ కథతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు భవానీ శంకర్‌.

Advertisement
 
Advertisement
Advertisement