Choreographer Sekhar Master About Rakesh Master's Life Journey - Sakshi
Sakshi News home page

Shekhar Master On Rakesh Master: మేము హైదరాబాద్‌ వచ్చాక జరిగింది ఇదే

Published Thu, Jun 29 2023 1:52 PM

Choreographer Sekhar Master About Rakesh Master life Journey - Sakshi

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొద్దిరోజుల క్రితం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసింది. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రాకేశ్‌ మాస్టర్‌ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

(ఇదీ చదవండి: 'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్‌.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్‌)

ఈ సందర్భంగా తను శిష్యులు అయినటువంటి శేఖర్‌ మాస్టర్‌తో పాటు సత్య మాస్టర్‌ భావోద్వేగానికి గురయ్యారు. రాకేష్‌ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మరణం తర్వాత శేఖర్‌ మాస్టర్‌ తొలిసారి ఇలా గుర్తుచేసుకున్నారు.  'నేను, సత్య ఇద్దరం విజయవాడలో డ్యాన్స్‌కు సంబంధించి  బేసిక్స్‌ వరకు నేర్చుకున్నాం. డ్యాన్స్‌ అంటే మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాం. మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు రాకేష్‌మాస్టర్‌     ఆశ్రయం కల్పించి, డ్యాన్స్‌ నేర్పించారు. రాకేశ్‌ మాస్టర్‌ గొప్ప డ్యాన్సర్‌. మాది 8 ఏళ్ల అనుబంధం. మీరు యూట్యూబ్‌లో ఆయన డ్యాన్స్‌ను చూసింది 5 శాతమే. ఆయనకు ఉ‍న్న టాలెంట్‌ చాలామందికి తెలియదు.

మొదట్లో నేను ప్రభుదేవా మాస్టర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాకేశ్‌ మాస్టర్‌ని అభిమానించడం ప్రారంభించా. ఆయన మా గురవు అని చెప్పుకుంనేందకు ఎప్పటికీ గర్వంగానే ఫీలవుతాము. ఆ రోజుల్లో డ్యాన్స్‌ తప్పా మాకు మరో ప్రపంచం లేదు. అప్పట్లో ఆయన పెళ్లి కూడా మేమే చేశాం.  ఎప్పుడూ రాకేశ్‌ మాస్టర్‌ దగ్గరే ఉండేవాళ్లం. ఆయన ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వాళ్లం, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతలా ఆయనతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్‌ పెట్టి ఏదేదో రాసేస్తున్నారు. దయచేసి మీకు వాస్తవాలు తెలిస్తేనే రాయండి.  లేదంటే రాయకండి. ప్లీజ్‌.. ఇకనైనా ఆపేయండి' అని శేఖర్‌ మాస్టర్‌ ఎమోషనల్‌ అయ్యారు.

(ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ)

Advertisement

తప్పక చదవండి

Advertisement