98 కిలోలు ఎలా తగ్గాడబ్బా?

Choreographer Ganesh Acharya Reveals He lost 98 kgs weight - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్, దర్శకుడు గణేశ్ ఆచార్య ఏకంగా 98 కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. కొరియోగ్రాఫర్‌, నటుడు ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఏబీసీడీ చిత్రంలో గణేష్‌ నటించిన విషయం తెలిసిందే. ఆ  సినిమాలో అయన భారీ శరీరంతో కనిపించారు. అయితే ఆ సమయంలో ఆయన దాదాపు 200 కిలోల బరువు ఉన్నారంట. ఇటీవల ప్రముఖ కపిల్‌ శర్మ కామెడీ షోకు అథితిగా వచ్చిన ఆయన ఏడాదిన్న కాలంలో 98 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. 

అయితే ఇదంతా అంత ఈజీగా జరగలేదని, ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్కరోజు కూడా జిమ్‌ మానకుండా కఠిన కసరత్తులు చేసి తగ్గానని చెప్పుకొచ్చారు. అంతేగాక 2015లో తను నటించిన ‘హే బ్రో’ సినిమా కోసం కూడా దాదాపు 40 కిలోల బరువు తగ్గినట్లు చెప్పారు. కాగా బాలీవుడ్‌లో గణేశ్ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, గోవింద, అజయ్ దేవగన్‌ వంటి సూపర్‌ స్టార్‌లకు ఆయన కొరియోగ్రాఫి అందించారు. ఈ క్రమంలో 2018లో ‘టాయ్‌లెట్’ సినిమాలోని ‘గోరీ తూ లాత్ మార్’ పాటకు పని చేసిన ఆయన బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top