విక్రమ్'తంగలాన్' ట్విటర్ రివ్యూ | Chiyan Vikram Thangalaan Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Thangalaan Twitter Review: 'తంగలాన్' ట్విటర్ రివ్యూ

Aug 15 2024 8:33 AM | Updated on Aug 15 2024 12:38 PM

Chiyan Vikram Thangalaan Movie Twitter Review

'అపరిచితుడు' తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తమిళ హీరో విక్రమ్. కాకపోతే ఈ మధ్య సరైన సినిమాలు పడట్లేదు. ప్రయోగాలు చేస్తున్న తెలుగు ఆడియెన్స్‌ కి ఎక్కట్లేదు. అయినా సరే మరో ఎక్స్‌పరిమెంట్ పాత్రతో వచ్చేశాడు. అదే 'తంగలాన్'. కర్ణాటకలోని కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు.ఇందులో విక్రమ్ ఆటవిక జాతికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, పార్వతి తిరువత్తు హీరోయిన్లుగా నటించారు.

పా.రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలాన్' షోలు ఆల్రెడీ థియేటర్లలో పడ్డాయి. చూసిన ప్రతి ఒక్కరూ యాక్టింగ్, డైరెక్షన్, సంగీతం అదిరిపోయాయని మెచ్చుకుంటున్నారు. విజువల్స్ కూడా కేక పుట్టించేలా ఉన్నాయని చెబుతున్నారు. విక్రమ్ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీని ప్రేక్షకులకు అందించాడని ఆకాశానికెత్తేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement