Chiranjeevi Waltair Veerayya Movie Trailer And Pre Release Date Update, Deets Inside - Sakshi
Sakshi News home page

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌.. పూనకాలు లోడింగ్‌!

Jan 6 2023 12:04 PM | Updated on Jan 6 2023 12:23 PM

Chiranjeevi Waltair Veerayya Trailer Update - Sakshi

దీనికంటే ఒకరోజు ముందు అంటే రేపు(జనవరి 7) ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్రయూనిట్‌. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. కేఎస్‌ రవీంద్ర డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. శ్రుతీహాసన్‌ కథానాయిక. ఈ సినిమా జనవరి 13న రిలీజ్‌ అవుతుండగా వీరసింహారెడ్డి దీనికంటే ఒకరో

ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్‌ హీరోలు బరిలోకి దిగుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, వీరసింహారెడ్డితో నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్‌ దగ్గర ఢీ కొట్టబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి రిలీజైన పాటలకు మంచి స్పందన లభించింది. నేడు ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుండగా రాత్రి 8.17 నిమిషాలకు ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నారు.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే వైజాగ్‌లో ఆదివారం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ రేపు(జనవరి 7) ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్రయూనిట్‌. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. కేఎస్‌ రవీంద్ర డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. శ్రుతీహాసన్‌ కథానాయిక. ఈ సినిమా జనవరి 13న రిలీజ్‌ అవుతుండగా వీరసింహారెడ్డి దీనికంటే ఒకరోజు ముందే బాక్సాఫీస్‌ బరిలో అడుగుపెట్టనుంది.

చదవండి: సంక్రాంతి సంబరం.. బాక్సాఫీస్‌ సమరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement