సంక్రాంతికి విశ్వంభర  | Chiranjeevi Starrer Mega 156 Officially Titled Vishwambhara, Makers Announced Release Date - Sakshi
Sakshi News home page

Chiranjeevi Vishwambhara: సంక్రాంతికి విశ్వంభర 

Published Wed, Jan 17 2024 2:42 AM

Chiranjeevi starrer Mega 156 officially titled Vishwambhara - Sakshi

హీరో చిరంజీవి సంక్రాంతి కానుకగా అభిమానులకు ఖుషీ కబురు చెప్పారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ ఖరారు చేసి, టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు మేకర్స్‌. అంతేకాదు.. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ‘బింబిసార’ వంటి హిట్‌ మూవీ తర్వాత దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. చిరంజీవిగారి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌: కార్తీక్‌ శబరీష్, లైన్‌ప్రోడ్యూసర్‌: రామిరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement