Chiranjeevi : 'స్థలం కొన్నాను.. త్వరలోనే విశాఖ వాసినవుతా' చిరు కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi Says He Plans To Settle In Vizag At Waltair Veerayya Pre Release - Sakshi

(విశాఖ తూర్పు): ప్రశాంత జీవితం గడపాలనుకునే వారికి విశాఖ అద్భుతమైన ప్రాంతమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలను ఆదివారం రాత్రి విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఎప్పటి నుంచో వైజాగ్‌లో నివాసం ఉందామని అనుకుంటున్నానని.. ఆ కల త్వరలో నెరవేరనుందని చెప్పారు. భీమిలి బీచ్‌ రోడ్డు వైపు స్థలం కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. త్వరలోనే ఇల్లు నిర్మించుకుని విశాఖ వాసి అవుతానని చెప్పారు.

విశాఖ వచ్చిన ప్రతిసారి ఒక ఉద్వేగానికి గురవుతానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. డైరెక్టర్‌ చిత్రం పేరు వాల్తేరు వీరయ్య చెప్పగానే చాలా పాజిటివ్‌ ఎనర్జీ వచ్చిందని, అందుకు కారణంగా వైజాగ్‌పై తనకున్న ప్రేమ అన్నారు. కార్యక్రమంలో మాస్‌ మహారాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ బాబ్జి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ, ఇతర నటీనటులు పాల్గొని తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమాతో అభిమానులకు మరింత పూనకాలు రావటం ఖాయమన్నారు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top