Megastar Chiranjeevi Satirical Comments On Waltair Veerayya Movie Reviews Rating - Sakshi
Sakshi News home page

Chiranjeevi: వాల్తేరు వీరయ్య రేటింగ్‌పై చిరు జోకులు.. అర్థం చేసుకోలేకపోయానంటూ సెటైర్‌

Jan 23 2023 6:06 PM | Updated on Jan 23 2023 7:21 PM

Chiranjeevi Satires On Waltair Veerayya Rating - Sakshi

సినిమా చూస్తే ప్రేక్షకుడి కడుపు నిండిపోతుంది. వారిచ్చే రేటింగ్‌ పట్టించుకోకూడదనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది. 2.25 రేటింగ్‌ అంటే 2.25 మిలియన్స్‌ అని తర్వాత తెలిసొచ్చింది.

'వాల్తేరు వీరయ్య' సినిమాతో అభిమానులకు పూనకాలు తెప్పించాడు మెగాస్టార్‌ చిరంజీవి. జనవరి 13న సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా రూ.182 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది! బాస్‌ యాక్టింగ్‌, డ్యాన్స్‌, గ్రేస్‌కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్‌. దీనికితోడు మాస్‌ మహారాజ రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు సినీలవర్స్‌తో ఈలలు కొట్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఆదరించిన ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని వెబ్‌సైట్లు వాల్తేరు వీరయ్యకు రెండు, రెండున్నర రేటింగ్‌ మాత్రమే ఇచ్చాయి. తాజాగా ఈ రేటింగ్‌పై సెటైర్లు వేశాడు బాస్‌.

'ఒక చిన్న జోక్‌ చెప్తాను.. ఎవరినీ విమర్శించడానికి కాదు, సరదాగా తీసుకోండి. కొన్ని వెబ్‌సైట్లు వాల్తేరు వీరయ్యకు 2, 2.5 రేటింగ్‌ ఇచ్చాయి. అయినా సరే నేను సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. సినిమాలో మంచి మాస్‌ మసాలా కంటెంట్‌ ఉంది. గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య.. ఇలాంటి సినిమాల్లో ఎంత ఫన్‌ ఉందో అంతే ఫన్‌ ఈ సినిమాలో ఇచ్చాం. సినిమా చూస్తే ప్రేక్షకుడి కడుపు నిండిపోతుంది. వారిచ్చే రేటింగ్‌ పట్టించుకోకూడదనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది. 2.25 రేటింగ్‌ అంటే 2.25 మిలియన్స్‌ అని తర్వాత తెలిసొచ్చింది. మేము అర్థం చేసుకోవడంలో పొరపడ్డామని గ్రహించాం' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి.

చదవండి: అర్ధరాత్రి ఇంటికి వెళ్తే గెంటేశారు: నటుడి భార్య
టాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement