పవర్‌ఫుల్‌ యాక్షన్‌ | Chiranjeevi Mega158 movie Hyderabad Schedule Begins | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ యాక్షన్‌

Jul 8 2026 12:16 AM | Updated on Jul 8 2026 12:16 AM

Chiranjeevi Mega158 movie Hyderabad Schedule Begins

చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూ పొందుతున్న సినిమా ‘చిరు158’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో అనశ్వర రాజన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో నివేతా పేతురాజ్‌ నటిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి పాల్గొంటుండగా ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.

‘‘పెద్ద సంఖ్యలో ఫైటర్స్‌ పాల్గొంటున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో చిరంజీవి సాహసోపేతమైన స్టంట్స్‌ చేస్తున్నారు. రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్స్‌ ఈ ఫైట్‌ను కొరియోగ్రఫీ చేస్తున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం. ‘కాకా’, ‘కాకాజీ’ వంటి టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌. వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే చాన్స్‌ ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement