తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్ | Watch: Che Long Live Movie Trailer Telugu B R Sabhavath Nayak, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Che Long Live Movie: తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Published Sat, Nov 11 2023 5:37 PM | Last Updated on Sat, Nov 11 2023 5:50 PM

Che Movie Trailer Telugu B R Sabhavath Nayak - Sakshi

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవితం ఆధారంగా తెలుగులో తీస్తున్న సినిమా 'చే'. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్‌లో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. 'చే' మూవీ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడాయన క్రేజీ న్యూస్ బయటపెట్టాడు. అలానే ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: పదో వారం ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌!)

క్యూబా తరువాత భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ త్వరలో కానుంది. డిసెంబర్ తొలివారం ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు హీరో కమ్ డైరెక్టర్ సభావత్ నాయక్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్‌ చివరి మాటలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement