'My Name Iju Raju': Chaavu Kaburu Challaga Telugu Movie First Song Released - Sakshi
Sakshi News home page

‘చావుకబురు చల్లగా’ ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

Feb 6 2021 3:15 PM | Updated on Feb 6 2021 3:42 PM

Chavu Kaburu Challaga First Song Released - Sakshi

' మైనేమ్ ఈజ్ రాజు... చస్తే ఏటైపోతుంది’అంటూ సాగే ఈ పాట మూవీలో హీరో క్యారెక్టర్‌ ఏంటో తెలియజేసేలా ఉంది

కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, డైలాగ్ టీజర్ విడుదలకాగా, తాజాగా మొదటి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర బృందం.

' మైనేమ్ ఈజ్ రాజు... చస్తే ఏటైపోతుంది’అంటూ సాగే ఈ పాట మూవీలో హీరో క్యారెక్టర్‌ ఏంటో తెలియజేసేలా ఉంది. ప్రముఖ సింగర్‌ రేవంత్ ఆలపించిన ఈ పాటకు క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించారు.  సినిమాలో బ‌స్తీబాలరాజు అనే క్యారెక్ట‌ర్ లో కార్తికేయ లుక్స్ కి, నేప‌థ్యానికీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్పుడు మై నేమ్ రాజు పాట కూడా సినీ అభిమానుల్ని కచ్ఛితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్రం బృందం భావిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement