Chalo Premiddam: స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు: నిర్మాత | Chalo Premiddam Movie Success Meet | Sakshi
Sakshi News home page

Chalo Premiddam: స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు: నిర్మాత

Nov 21 2021 3:34 PM | Updated on Nov 21 2021 3:35 PM

Chalo Premiddam Movie Success Meet - Sakshi

‘ఛ‌లో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా స‌క్సెస్ మ‌రెన్నో సినిమాలు చేయ‌డానికి నాకు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది’ అన్నారు నిర్మాత ఉదయ్‌ కిరణ్‌. హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్  నిర్మించిన  చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.  ఈ చిత్రం ఈనెల 19న విడుద‌లై పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతూ  థియేట‌ర్స్ పెంచుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో స‌క్సెస్  మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియ‌న్స్ కార‌ణం. అంద‌రూ సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ పెట్టారు. చిన్న సినిమాని పెద్ద సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక‌పైన కూడా మా సంస్థ నుంచి వ‌చ్చే చిత్రాల‌ను ఈ విధంగానే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అన్నారు.
(చదవండి: ‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ)

ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ రేపల్లె మాట్లాడుతూ...‘మా సినిమాకు విడుద‌లైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  ముఖ్యంగా పాట‌లు, నేప‌థ్య‌ సంగీతం, ద‌ర్శ‌క‌త్వం, కామెడీ , నిర్మాణ విలువ‌లు సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. ఆడియ‌న్స్ తో  క‌లిసి ఫ‌స్ట్ రోజు సినిమా చూశాను.  అదుర్స్ ర‌ఘు కామెడీ, పోసాని, హేమ మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్, అత్తారింటికి దారిది  ఎపిసోడ్ కు ఆడియ‌న్స్ ప‌డి ప‌డి న‌వ్వుతున్నారు. క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్ట్   , శ‌శాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్ర‌లు సినిమాకు హైలెట్ అంటున్నారు.  సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా టీమ్ స‌పోర్ట్ వల్లే. వ‌ర్షాల్లో కూడా మా సినిమాను ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు’అన్నారు.

 హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ....‘ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను.  అంద‌రూ  నా ప‌ర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత‌ మంచి హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement