breaking news
Chalo Premiddam Movie
-
Chalo Premiddam: సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత
‘ఛలో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ మరెన్నో సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టప్ ఇచ్చింది’ అన్నారు నిర్మాత ఉదయ్ కిరణ్. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం ఈనెల 19న విడుదలై పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ థియేటర్స్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియన్స్ కారణం. అందరూ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇకపైన కూడా మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలను ఈ విధంగానే ఆదరిస్తారని కోరుకుంటున్నా` అన్నారు. (చదవండి: ‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ) దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ...‘మా సినిమాకు విడుదలైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం, దర్శకత్వం, కామెడీ , నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అంటున్నారు. ఆడియన్స్ తో కలిసి ఫస్ట్ రోజు సినిమా చూశాను. అదుర్స్ రఘు కామెడీ, పోసాని, హేమ మధ్య వచ్చే ఫన్, అత్తారింటికి దారిది ఎపిసోడ్ కు ఆడియన్స్ పడి పడి నవ్వుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ , శశాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్రలు సినిమాకు హైలెట్ అంటున్నారు. సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే మా టీమ్ సపోర్ట్ వల్లే. వర్షాల్లో కూడా మా సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అన్నారు. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ....‘ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను. అందరూ నా పర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అన్నారు. -
‘ఛలో ప్రేమిద్దాం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఛలో ప్రేమిద్దాం నటీనటులు : సాయి రోనక్, నేహా సోలంకీ, పొసాని కృష్ణమురళి, హేమ, అలీ, బాహుబలి ప్రభాకర్, సూర్య తదితరులు నిర్మాణ సంస్థ : హిమాలయ స్టూడియో మేన్సన్స్ నిర్మాతలు : ఉదయ్ కిరణ్ దర్శకత్వం : సురేష్ శేఖర్ రేపల్లే సంగీతం : భీమ్స్ సిసిరోలియో ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క సినిమాటోగ్రఫీ: అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి విడుదల తేది : నవంబర్ 19, 2021 `బ్లాక్ అండ్ వైట్`, ప్రియుడు సినిమాలతో టాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కుమార్ తాజాగా హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. `ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించారు. సురేష్ శేఖర్ రేపల్లె దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అందమైన ప్రేమకథతో పాటు, థ్రిల్లింగ్ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్సాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచింది. ఎన్నో అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 19)థియేటర్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. ‘ఛలో ప్రేమిద్దాం’కథేంటంటే.. వైజాగ్‌కు చెందిన ఆత్మరావు అలియాస్ రావు (సాయి రోనక్) ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్‌కు వస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న మధుమతి(నేహా సోలంకీ)తో ప్రేమలో పడతాడు. మధుమతికి కూడా రావు అంటే ఇష్టం ఉన్నప్పటీ ఆ విషయం అతనికి చెప్పదు. చిత్తూరులో ఉన్న తన మామయ్య, ఊరిపెద్ద పెద్దప్ప(నాగినీడు), సోదరుడు శివుడు(సూర్య)లకు నచ్చితేనే తన ప్రేమను ఆత్మరావుకు చెప్పాలని ఫిక్స్ అవుతుంది. తన సోదరి పెళ్లికి ఆత్మరావుతో పాటు మిగతా స్నేహితులను ఇంటికి ఆహ్వానిస్తుంది మధుమతి. కట్ చేస్తే.. మధుమతి కిడ్నాప్‌కి గురవుతుంది. ఈ వ్యవహారంలో ఆత్మరావుతో పాటు అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు మధుమతిని కిడ్నాప్ చేసిందేవరు? ఎందుకు చేశారు? ఈ కేసులో ఆత్మరావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రియురాలి కోసం ఆత్మరావు చేసిన సాహసం ఏంటి? చివరకు మధుమతి తన ప్రేమ విషయాన్ని ఆత్మరావుకు చెప్పిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. కాలేజ్ స్టూడెంట్ ఆత్మరావు పాత్రలో సాయి రోనక్ ఒదిగిపోయాడు. డాన్స్‌తో పాటు ఫైట్ సీన్స్ కూడా అదరొట్టాడు. ఇక అల్లరి పిల్ల మధుమతిగా నేహా సోలంకీ తనదైన నటనతో మెప్పించింది. హే భగవాన్ అల్లా జీసస్ అంటూ నవ్వులు పూయించడంతో పాటు తెరపై అందంగా కనిపించింది. `ఫోన్ ఎక్కువ మాట్లాడకండి.. మ్యాటర్ పనిచేయదు` అని హీరోయిన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. గ్రామపెద్దగా నాగీనీడు, అతనికి నమ్మదగిన వ్యక్తి శివుడు పాత్రలో సూర్య అద్భుత నటనను కనబరిచారు. కారుమంచి రఘు కామెడీ ఆకట్టుకుంటుంది. మరోవైపు ఫ్రెండ్స్ గా భరత్,పవన్ ఫర్వాలేదనిపించారు.హీరో తండ్రిగా పోసాని, తల్లిగా హేమతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎలా ఉందంటే.. సరదాగా జాలీగా ఉండే అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడిన తరువాత వారి ప్రేమ ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, వాటిని ఎలా ఎదుర్కొని నిలబడ్డారు అనేదే ‘ఛలో ప్రేమిద్దాం’కథ. యూత్‌కు నచ్చే పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లే.. అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించాడు. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో లవ్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించాడు. ఒకపక్క కాలేజీ లవ్‌స్టోరి చూపిస్తూనే.. మరోపక్క యాక్షన్ ఎపిసోడ్‌ని నడిపిస్తూ ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. అయితే సినిమా నిడివి మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ‘అత్తారింటికి దారిది’హోటల్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో గేతో వచ్చే సన్నీవేశాలు కూడా యూత్‌ని నవ్విస్తాయి. క్లైమాక్స్ మాత్రం మరింత క్రిస్పిగా రాసుకోవాల్సింది. ఎక్కువ సేపు క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండటంతో ఆడియెన్స్ సహనం పరీక్షించేలా అనిపిస్తుంది.ఇక సాంకేతిక విషయానికొస్తే.. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన‘ఏమైందిరో’,‘జిందగి’పాటలలో పాటు మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఎడిటర్ ఉపేంద్ర జక్క తన కత్తెరగా ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఛలో ప్రేమిద్దాం’
`ప్రెజర్ కుక్కర్` ఫేమ్ సాయి రోనక్, `90 ఎమ్ ఎల్` ఫేమ్ నేహ సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ శేఖర్ రేపల్లె దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను గతంలో రాజీవ్ కనకాలతో `బ్లాక్ అండ్ వైట్`, వరుణ్ సందేశ్ హీరోగా `ప్రియుడు` చిత్రాలు నిర్మించాను. ప్రియుడు సినిమా సమయంలో సురేష్ పరిచయం. ఆ సమయంలోనే తను ఒక మంచి కథ చెప్పాడు . ఆ కథ నచ్చి ` ఛలో ప్రేమిద్దాం` చిత్రం నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రజంట్ ట్రెండ్ కు కనెక్టయ్యే అంశాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. ఇందులో మంచి లవ్ స్టోరితో పాటు థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. దర్శకుడు సినిమాను చాలా బాగా డీల్ చేశారు. ఇది అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.... ‘ఈ చిత్రంలో పంచ భూతాల్లాంటి ఐదు పాటలున్నాయి. భీమ్స్ అంటే ఇప్పటి వరకు అందరూ మాస్ సాంగ్స్ అనుకునే వారు. కానీ, ఈ సినిమాతో భీమ్స్ మాస్ తో పాటు, మెలోడీ సాంగ్స్ కూడా అద్భుతంగా చేయగలడని ప్రూవ్ చేసే విధంగా పాటలుంటాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగా కుదిరింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. కచ్చితంగా ఛలో ప్రేమిద్దాం చిత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు.