Actor Chalapathi Rao's Funeral Completed in Mahaprastanam - Sakshi
Sakshi News home page

Chalapathi Rao: ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు

Dec 28 2022 10:27 AM | Updated on Dec 28 2022 12:14 PM

Chalapathi Rao Funeral Completed - Sakshi

నటుడు చలపతిరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. కుమారుడు రవిబాబు చలపతిరావు కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.కుటుంబ సభ్యులతో పాటు హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈనెల 24 గుండెపోటుతో చలపతి రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో చలపతిరావు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు రవిబాబు చలపతిరావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు 1200 పైగా చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చలపతిరావు.

Advertisement
 
Advertisement
Advertisement