నటి సోదరుడిపై కత్తులతో దాడి.. వీడియో వైరల్‌ | CCTV Video Shows How Actress Huma Qureshi Cousin issue | Sakshi
Sakshi News home page

నటి సోదరుడిపై కత్తులతో దాడి.. వీడియో వైరల్‌

Aug 8 2025 11:42 AM | Updated on Aug 8 2025 11:57 AM

CCTV Video Shows How Actress Huma Qureshi Cousin issue

బాలీవుడ్‌ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు ఆసిఫ్‌ ఖురేషీ దారుణ హత్యకు గురైయ్యారు. అందుకు సంబంధించిన వీడియోను (పీటీఐ) షేర్‌ చేసింది. ఇద్దరు యువకులు ఆసిఫ్‌ ఖురేషీ ఇంటి ముందు ద్విచక్ర వాహనం పార్కింగ్‌ చేయడంతో గొడవ మొదలైంది. దీంతో ఆయుధాలతో అతనిపై ఆ యువకులు తెగబడ్డారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.  నటి హుమా ఖురేషికి మృతుడు ఆసిఫ్‌ సోదరుడు వరస అవుతాడు.

ఘటన జరిగిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పలు సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు.  ఆసిఫ్, అతని పొరుగువారి మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ వీడియో  ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతుంది. చాలా ధారుణంగా అతనిపై తెగబడ్డారు. బలంగా కొట్టడంతో పాటు పదునైనా ఆయుధాలతో దాడి చేసినట్లు వీడియోతో అర్థం అవుతుంది.  ఈ హత్యకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 103(1) హత్య, 3(5) సాధారణ ఉద్దేశ్యం కింద  ఉజ్వల్ (19) మరియు గౌతమ్ (18)పై నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యువకులు ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement