ఆ వార్తల్లో నిజం లేదు: సీబీఐ

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) కీలక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్ కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని, సీబీఐ పేరుతో మీడియాలో వస్తున్న వార్తలు సరైనవి కావని సీబీఐ స్పష్టం చేసింది. అయితే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.
మరోవైపు సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను కూడా సీబీఐ ప్రశ్నించింది. కాగా, తన కుమారుడిని మానసికంగా వేధించడంతోపాటు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బుని అక్రమంగా మళ్లించారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపిస్తూ బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి