Buzz: Is Samantha Going To Put Conditions About Her Roles And Scenes In Movies - Sakshi
Sakshi News home page

Samantha: సంచలన నిర్ణయం తీసుకున్న సమంత.. ఇకపై వాటికి దూరం

Sep 3 2022 1:45 PM | Updated on Sep 3 2022 3:08 PM

Buzz: Is Samantha Going To Put Conditions About Her Roles And Scenes In Movies - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఆమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు విజయ్‌తో ఖుషీ, హిందీలో ఓ వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తుంది. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకుల తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచేసిన సామ్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోషూట్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అయితే సడెన్‌గా సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇచ్చిన సమంత తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుందట.

ఇకపై చేసే సినిమాల్లో గ్లామర్‌ రోల్స్‌, లిప్‌ లాక్‌ సమా ఇంటిమేట్‌ సీన్స్‌కి దూరంగా ఉండాలని ఆమె డిసైడ్‌ అయ్యిందట. ఈ కండీషన్స్‌కి ఒప్పుకుంటేనే సినిమాలకు సైన్‌ చేస్తుందట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మీ దునియాలో చక్కర్లు కొడుతుంది.

కాగా పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు మాత్రమే సైన్‌ చేసిన సామ్‌ ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌సిరీస్‌లో మాత్రం బోల్డ్‌ సీన్స్‌లో నటించింది. ఈ కారణంగానే చై, సామ్‌ మధ్య విబేధాలు తలెత్తి అవి విడాకులకు దారి తీసిందని వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement