
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ త్వరలోనే తెలుగు తెరపై సందడి చేయనుందా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్. రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్, ఫతే వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించిన జాక్వెలిన్‌ని ‘పేపర్ బాయ్’ ఫేం జయశంకర్ టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. ఆయన దర్శకత్వం వహించే ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీలో జాక్వెలిన్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.
జయశంకర్ ఆల్రెడీ జాక్వెలిన్‌కు యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను వివరించారట. జాక్వెలిన్‌కు జయశంకర్ చెప్పిన పాత్ర, కథ చాలా నచ్చినట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్నందున జాక్వెలిన్ కూడా పాత్రను పోషించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ సైతం ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం.
ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని, జాక్వెలిన్ ఇది వరకు ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతోన్నట్టుగా తెలుస్తోంది. స్క్రిప్ట్‌లో వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన వర్క్ కూడా చాలా ఉందని సమాచారం. ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా థ్రిల్లింగ్ వీఎఫ్ఎక్స్ అంశాలతో చిత్రం రూపొందనుందట. జాక్వెలిన్ పాన్ ఇండియా నటి కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో నిర్మించనున్నారట. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టుగా సమాచారం.