నాకు డ్యాన్స్ చేయాలనిపించింది | Bubble Gum Movie Izzat Song Launched By Megastar Chiranjeevi, Comments Goes Viral - Sakshi
Sakshi News home page

నాకు డ్యాన్స్ చేయాలనిపించింది

Published Fri, Nov 24 2023 1:05 AM

Bubble Gum Song Launch By Megastar Chiranjeevi - Sakshi


‘‘బబుల్‌గమ్‌’ సినిమాలోని ‘ఇజ్జత్‌..’పాట చాలా హుషారుగా అనిపించింది. శ్రీచరణ్‌ పాకాల చక్కని సంగీతం అందించారు. ‘ఇజ్జత్‌..’ అనే ర్యాప్‌ సాంగ్‌లో రోషన్‌తో కలసి డ్యాన్స్ చేయాలనిపించింది.  ప్రతి క్లబ్, పబ్, యూత్‌ వేడుకల్లో ఈ పాట మార్మోగుతుంది’’ అని హీరో చిరంజీవి అన్నారు.

రోషన్‌ కనకాల, మానస చౌదరి జంటగా రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహించిన చిత్రం ‘బబుల్‌గమ్‌’.  మహేశ్వరి మూవీస్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 29న రిలీజ్‌ కానుంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఇజ్జత్‌..’  పాటను చిరంజీవి రిలీజ్‌ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి ఎం.ఎస్‌. హరి సాహిత్యం అందించగా, రోషన్‌ కనకాల, ఎం.ఎస్‌. హరి పాడారు.

Advertisement
 
Advertisement