Nagarjuna First Look of Brahmastra: నంది అస్త్ర పాత్రలో నాగార్జున, ఫస్ట్ లుక్ చూశారా?

Brahmastra: Nagarjuna As Nandi Astra, First Look Released - Sakshi

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్- అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై  భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున "నంది అస్త్ర" అనే శక్తి ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు.

సహస్ర నదీమ్ సమరత్యం 
హే నంది అస్త్రం 
ఖండ్ ఖండ్ కురు 
మమ్ సహక్యం మమ్ సహక్యం.. 
అంటే ఒక అస్త్రంలో వేయి నందిలా బలం ఉంటుందట. ఇదిలా ఉంటే రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి "బ్రహ్మాస్త్రం" సినిమా ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో సందర్శించిన సంగతి తెలిసిందే. జూన్ 15న బ్రహ్మస్త్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మరమైన సినిమాను సెప్టెంబర్‌ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

చదవండి: మేజర్‌.. పాన్‌ ఇండియా చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు.. కానీ!
యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top