పవన్‌ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM | BoyCott Hari Hara Veera Mallu Hashtags Trending On Social Media | Sakshi
Sakshi News home page

‘వీరమల్లు’పై స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ఫైర్‌.. ట్రెండింగ్‌లో #BoycottHHVM

Jul 22 2025 7:38 PM | Updated on Jul 22 2025 8:12 PM

BoyCott Hari Hara Veera Mallu Hashtags Trending On Social Media

పవన్కల్యాణ్ప్రవర్తన వింతగా ఉంటుంది. సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఆయనే చెబుతాడు. మళ్లీ ఆయనే సినిమా వేదికపై రాజకీయాలు, రాజకీయ వేదికలపై సినిమా విషయాలు మాట్లాడుతాడు. పవన్‌ ప్రవర్తనే ఇప్పుడు ఆయన సినిమాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఆయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమాకు ఇప్పుడు నిరసన సెగ తగిలింది. పవన్వ్యాఖ్యలతో విసుగెత్తిపోయిన వైఎస్సార్సీసీ అభిమానులకు తోడు అల్లు అర్జున్‌, మహేశ్‌, ప్రభాస్లాంటి స్టార్హీరోల ఫ్యాన్స్కూడా హరిహర వీరమల్లు సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్వీట్స్చేస్తున్నారు. దీంతో #BoycottHHVM ట్యాగ్ఇప్పుడు ట్విటర్లో ట్రెండింగ్గా మారింది.

ఏం జరిగిదంటే..
తాజాగా జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రీరిలీజ్ఈవెంట్లో పవన్రాజకీయాలు మాట్లాడారు. సినిమా గురించి చెప్పడం మరచి.. ‘గతంలో భీమ్లా నాయక్సినిమా టికెట్రూ.10-15 పెట్టిన నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మన సత్తా ఏంటో చూపిద్దాంఅంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీనికి ఆజ్యం పోసేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఇప్పుడు ఇదే నిరసనకు దారి తీసింది. వైఎస్సార్సీపీ అభిమానులు పవన్వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్చేస్తున్నారు. మేమే కాదు ..మాతో పాటు మరో 20-30 మందిని కూడా సినిమాను చూడనియ్యబోమంటూ #BoycottHHVM హ్యాష్ట్యాగ్తో ట్వీట్స్చేస్తున్నారు.

స్టార్‌హీరోల ఫ్యాన్స్కూడా..
అభిమానం ఉంటే హీరో సినిమాలు చూడాలే తప్ప ఇతర హీరోల సినిమాలను నాశనం చేయకూడదు. కానీ పవన్ఫ్యాన్స్మాత్రం హీరోకైనా కాస్త పేరొస్తే చాలు.. ఆయన సినిమాను తొక్కేయాలని చూస్తారనే టాక్టాలీవుడ్లో ఉంది. గతంలో బన్నీ, మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ సినిమాలపై ట్రోల్స్చేశారు. పుష్ప 2 రిలీజ్అప్పుడు అయితే అల్లు అర్జున్పై దారుణమైన కామెంట్స్చేస్తూ.. సినిమాను బాయ్‌కాట్చేయాలంటూ సోషల్మీడియాలో ప్రచారం చేశారు

మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఇతర హీరోల ఫ్యాన్స్‌ అన్నట్లు అందరి హీరోల సినిమాలను ట్రోల్చేశారు. ఇప్పుడు స్టార్హీరోల ఫ్యాన్స్కూడా పవన్సినిమాపై పగ బట్టారు. తాము హరిహర వీరమల్లు సినిమాను చూడబోం అంటూ ట్వీట్స్చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ఫ్యాన్స్పెద్ద ఎత్తున ట్రోల్చేస్తూ..తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ అభిమానులు, మరోవైపు స్టార్హీరోల ప్యాన్స్దెబ్బకి #BoycottHHVM హ్యాష్ట్యాగ్ట్రెండింగ్లోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement