Ranveer Singh: రణ్‌వీర్‌ చెంప చెళ్లుమనిపించిన బాడిగార్డ్‌! అసలేం జరిగిందంటే..

Bodyguard Slapped Ranveer Singh At SIIMA Award Function Video Goes Viral - Sakshi

ఇటీవల జరిగిన సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ ఫెస్టివల్‌లో షాకింగ్‌ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్‌లో బాడిగార్డ్‌.. రణ్‌వీర్‌ చెంప చెళ్లుమనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా ప్రతి ఏటా నిర్వహించిన ప్రతిష్టాత్మక సైమా 2022 అవార్డు కార్యక్రమాన్ని శనివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్‌కు దక్షిణాది చెందిన అగ్ర తారలతో పాటు బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

చదవండి: సిసింద్రి టాస్క్‌లో ట్విస్ట్‌.. శ్రీహాన్‌కు షాకిచ్చిన గలాట గీతూ 

టాలీవుడ్‌ నుంచి అల్లు అర్జున్‌, పూజా హెగ్డె, విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌లు తదితరులు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన రణ్‌వీర్‌ సింగ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన తనదైన స్టైల్లో సందడి చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్‌ మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా రణ్‌వీర్‌ ఈ అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్‌కు హజరైన రణ్‌వీర్‌ బయట సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇక వారితో సరదాగా మాట్లాడుతూ సెల్ఫీలకు ఫోజులు ఇస్తున్నాడు.

చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్‌

ఈ క్రమంలో రణ్‌వీర్‌ మీదకు ఎగబడుతున్న జనాలను పక్కనే ఉన్న బాడిగార్డ్స్‌ కంట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బాడీగార్డ్‌ చేయి రణ్‌వీర్‌ చెంపకు గట్టిగా తగిలింది. దాంతో రణ్‌వీర్‌ ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా తగలడంతో కాసేపు చెంప మీద చేయి అలాగే ఉంచి అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top