సినిమా సూపర్‌ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్‌ | Birthday interview of producer Bekkem Venugopal | Sakshi
Sakshi News home page

సినిమా సూపర్‌ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్‌

Apr 27 2023 1:23 AM | Updated on Apr 27 2023 10:12 AM

Birthday interview of producer Bekkem Venugopal - Sakshi

బెక్కెం వేణుగోపాల్‌

‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్‌ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్‌ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్‌ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్‌ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌. నేడు(ఏప్రిల్‌ 27) బెక్కెం వేణుగోపాల్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్‌ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్‌ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్‌ హీరోలతో, భారీ బడ్జెట్‌ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి.

ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్‌’, సుడిగాలి సుధీర్‌తో నరేష్‌ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్‌ ప్రధాన పాత్రలో స్వరూప్‌ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement