ముంబై వీధుల్లో ఆటో నడిపిన సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ | Bigg Boss Winner Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral | Sakshi
Sakshi News home page

Rahul Sipligunj : ఆటో నడిపిన బిగ్‌బాస్‌-3 విన్నర్‌ రాహుల్‌.. వీడియో వైరల్‌

Dec 21 2021 4:27 PM | Updated on Dec 21 2021 4:50 PM

Bigg Boss Winner Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral - Sakshi

Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral: బిగ్‌బాస్‌ సీజన్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ ముంబై వీధుల్లో ఆటో నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవలె ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్‌ ముంబై వెళ్లాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎంతగానో పాపులర్‌ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్‌ పాడిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి7న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్‌ భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్‌ క్యూటీ ఆలియాభట్‌, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement