రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌.. బన్నీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా! | Bigg Boss Winner Pallavi Prashanth New Stylish Goes Viral | Sakshi
Sakshi News home page

Pallavi Prashanth: బిగ్‌బాస్‌ విన్నర్ పల్లవి ప్రశాంత్.. అస్సలు తగ్గేదేలే!

Oct 15 2024 3:21 PM | Updated on Oct 15 2024 3:27 PM

Bigg Boss Winner Pallavi Prashanth New Stylish Goes Viral

రైతు బిడ్డ ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. బిగ్‌బాస్‌ సీజన్-7 విన్నర్‌గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్‌బాస్‌ విన్నర్‌గా స్టార్‌గా ఎదిగాడు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.. తాజాగా స్టార్‌ మా అవార్డ్స్‌ వేడుకలో మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌ మా తన తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది. మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement