Bigg Boss 7 Telugu Day 63 Highlights: తేజ అవుట్‌ కాక‌ముందే రాగ‌మెత్తుకున్న ర‌తిక‌.. ఒక్క‌వారం ప్లీజ్ అంటూ..

Bigg Boss Telugu 7: Shobha Shetty Cries Over Tasty Teja Elimination - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆల్‌రెడీ లీక‌వడంతో ఎపిసోడ్‌లో పెద్ద ప‌స లేకుండా పోయింది. అయితే అటు తేజ క‌న్నా ర‌తిక తానెక్క‌డ ఎలిమినేట్ అవుతుందోన‌ని తెగ భ‌య‌ప‌డిపోయింది. ప్లీజ్‌, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని నాగ్‌ను అర్థించింది. ఇంత‌లో తేజ ఎలిమినేట్ అన‌డంతో ఊపిరి పీల్చుకుంది. మ‌రి హౌస్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో నేటి(న‌వంబ‌ర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చ‌దివేయండి..

గాడిద‌కేం తెలుసు గంధ‌పు చెక్క వాస‌న..
నాగార్జున‌ కొన్ని సామెత‌ల‌ను ఇచ్చి అది ఎవ‌రికి బాగా సూట‌వుతుందో చెప్పాల‌న్నాడు. భోలె షావ‌ళి.. అమ‌ర్‌ది కుక్క తోక వంక‌ర అన్నాడు. అమ‌ర్‌.. గాడిద‌కేం తెలుసు గంధ‌పు చెక్క వాస‌న అనే బోర్డును అశ్విని మెడ‌కు త‌గిలించాడు. ప్ర‌శాంత్ ఏకులా వ‌చ్చి మేకులా త‌గిలాడ‌న్నాడు అర్జున్‌. ఇక తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిప‌డ‌తాడ‌ని చెప్పాడు ప్ర‌శాంత్‌. నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుంద‌నే సామెత అశ్వినికి బాగా సూట‌వుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది ప్రియాంక‌.

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏం లాభం?
భోలె షావ‌ళి.. ఓడ ఎక్కేవ‌ర‌కు ఓడ మ‌ల్ల‌న్న‌.. ఓడ దిగాక బోడ మ‌ల్ల‌న్న అని పేర్కొంది ర‌తిక‌. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏం లాభం? అనేది ర‌తిక విష‌యంలో నిజ‌మైంద‌న్నాడు గౌత‌మ్‌. పొరుగింటి పుల్ల‌కూర రుచి అనే బోర్డు భోలెకు వేశాడు తేజ‌. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటే ఏం లాభ‌మ‌నే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్ యావ‌ర్‌. వేలు ఇస్తే చేయి గుంజిన‌ట్లు అనే బోర్డును ప్రియాంక మెడ‌లో వేసింది అశ్విని. కంద‌కు లేని దుర‌ద క‌త్తిపీట‌కు ఎందుకు? అనే సామెత తేజ‌కు ప‌ర్ఫెక్ట్‌గా సూట‌వుతుంద‌న్నాడు శివాజీ. ఇటు రా అంటే ఇల్లంత నాదే అన్న‌ట్లుగా తేజ‌ ప్ర‌వ‌ర్తిస్తాడంది శోభ‌.

ఎలిమినేష‌న్ భ‌యంతో ఏడ్చేసిన ర‌తిక‌
త‌ర్వాత జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ చిత్ర‌ యూనిట్‌ రాఘ‌వ లారెన్స్, ఎస్‌జే సూర్య స్టేజీపైకి వ‌చ్చి సంద‌డి చేశారు. వీరు హౌస్‌మేట్స్‌తో హుక్ స్టెప్ గేమ్ ఆడించి వెళ్లిపోయారు. త‌ర్వాత తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బ హౌస్‌లోకి వెళ్లి పీరియ‌డ్స్ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడి అవ‌గాహ‌న తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అనంత‌రం నాగ్ అంద‌రినీ సేవ్ చేసుకుంటూ రాగా చివ‌ర‌గా ర‌తిక‌, తేజ మాత్ర‌మే మిగిలారు. ఎక్క‌డ ఎలిమినేట్ అయిపోతానోన‌ని ర‌తిక తెగ ఏడ్చేసింది. చివ‌ర‌కు తేజ ఎలిమినేట్ అన‌గానే ర‌తిక‌కు పోయిన ప్రాణం తిరిగి వ‌చ్చిన‌ట్ల‌యింది. ఇక తేజ ఏడ‌వ‌కూడ‌ద‌నుకుంటూనే క‌న్నీళ్లు పెట్టుకున్నాడు.

శోభ‌కు ఎక్కువ మార్కులిచ్చిన తేజ‌
ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. తేజ కంటే శోభ ఎక్కువ ఏడ్చింది. అంద‌రికీ వీడ్కోలు ప‌లికేముందు హౌస్‌మేట్స్‌కు మార్కులు ఇచ్చాడు తేజ‌. శోభ‌కు ప‌దికి 20 మార్కులిచ్చాడు. గౌత‌మ్‌కు 8, అర్జున్‌కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్ యావ‌ర్‌కు 10, భోలె షావ‌ళికి 7మార్చులిచ్చాడు. ఆట‌ప‌రంగా ఓకే కానీ మాట‌తీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓట‌మిని తీసుకోలేడంటూ ప్ర‌శాంత్‌కు 9, వంట‌ల‌క్క ప్రియాంక‌కు 10, అమ‌ర్‌దీప్‌కు 9, శివాజీకి 8, ర‌తిక‌కు 5 మార్కులిచ్చాడు.

అంటూ ఏడుపందుకున్న శోభ‌
సెల‌వు తీసుకోవ‌డ‌మే ఆల‌స్యం అనుకునే స‌మ‌యానికి శోభ మ‌ళ్లీ ఏడుపు మొద‌లుపెట్టింది. ఇక్క‌డ‌ నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియ‌ట్లేదు, భ‌య‌మేస్తోంది తేజ అంటూ శోక‌మందుకుంది. నీతో ఒక్క‌రోజు మాట్లాడ‌కుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్‌లో చాలా రోజులు ఉండాలంటే  భ‌య‌మేస్తోంది అని క‌న్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో ఉన్న‌ప్పుడు నువ్వెవ‌రు? అంటూ గ‌డ్డిపోచ క‌న్నా హీనంగా చూసిన శోభ త‌న‌కోసం ఏడుస్తున్నందుకు సంతోష‌ప‌డాలా? బాధ‌ప‌డాలా? తెలియ‌ని అయోమ‌యంలో ఉన్న శోభ ఎప్ప‌టిలాగే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు.

చ‌ద‌వండి: తొమ్మిది వారాల్లో తేజ అంత సంపాదించాడా? ఎలిమినేష‌న్‌కు కార‌ణ‌మిదే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2023
Nov 13, 2023, 23:05 IST
బిగ్‌బాస్ 7లో మరో నామినేషన్స్ డే వచ్చేసింది. అయితే ఈసారి రతిక కాస్త ఓవరాక్షన్ చేసింది. అది కూడా ఓ...
13-11-2023
Nov 13, 2023, 14:03 IST
బిగ్ బాస్ సీజన్ -7 మరో వారం ముగిసింది. ఇప్పటి వరకు పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రేక్షకులను...
13-11-2023
Nov 13, 2023, 13:34 IST
నువ్వు ఎప్పుడైనా సొంతంగా ఎవరినైనా నామినేట్‌ చేశావా? అని అడిగాడు. ఇంతలో ప్రశాంత్‌లో అపరిచితుడు బయటకు రాగా.. బరాబర్‌ చెప్తున్నా.....
13-11-2023
Nov 13, 2023, 12:57 IST
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ...
13-11-2023
Nov 13, 2023, 08:11 IST
బిగ్‌ బాస్‌తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో...
13-11-2023
Nov 13, 2023, 06:47 IST
బిగ్‌బాస్ షోలో ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. సోమవారం నామినేషన్స్ పూర్తవగానే.. బయటకెళ్లేది ఎవరనేది ప్రేక్షకులు గెస్ చేస్తుంటారు....
12-11-2023
Nov 12, 2023, 23:21 IST
బిగ్‌బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్‌తో పదోవారం ముగిసింది. గత...
12-11-2023
Nov 12, 2023, 23:10 IST
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ...
12-11-2023
Nov 12, 2023, 18:53 IST
బిగ్‌బాస్ షో అంటే ఎప్పుడూ గొడవలే కాదు సర్‌ప్రైజులు కూడా ఉంటాయి. గత కొన్నిరోజులుగా హౌసులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది....
12-11-2023
Nov 12, 2023, 16:58 IST
పాత నీరుపోవడం, కొత్త నీరు రావడం సహజం. అలా సినిమాల్లోనూ కొత్త ప్రవాహం వస్తూనే ఉంటారు. వారిలో నిలబడేది ఎందరన్నదే...
12-11-2023
Nov 12, 2023, 13:51 IST
తన కొత్తింట్లోనే పార్టీ సెలబ్రేట్‌ చేసుకున్నట్లు పేర్కొంది. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో దీపావళి వేడుకలు చేసుకుంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం...
12-11-2023
Nov 12, 2023, 12:40 IST
బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్స్‌  ఏదైన తప్పు చేసిన.. తప్పుడు మాటలు మాట్లాడినా.. వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ఫుల్‌ క్లాస్‌ తీసుకుంటాడు....
11-11-2023
Nov 11, 2023, 23:07 IST
బిగ్‌బాస్ షోలో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున.. స్మూత్‌గా కౌంటర్స్ వేశాడు. శివాజీ విషయంలో మాత్రం...
11-11-2023
Nov 11, 2023, 21:05 IST
బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్‌బ్యూటీస్‌నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్...
11-11-2023
Nov 11, 2023, 16:16 IST
ఇతడు కూడా పెద్దగా ఆడింది లేదు, కానీ పాటలతో ఇరగదీస్తున్నాడు. అప్పటికప్పుడు పాటలను అవలీలగా పాడేసే అతడి టాలెంట్‌కు జనాలు...
10-11-2023
Nov 10, 2023, 23:13 IST
బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్‌గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ పెద్ద...
10-11-2023
Nov 10, 2023, 16:38 IST
బిగ్‌బాస్ హౌస్ ఎందుకో ఏడిపించేస్తోంది. ప్రతిసారీ ఉన్నట్లే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే హౌసులోకి వస్తున్న ప్రతిఒక్కరూ అక్కడ...
10-11-2023
Nov 10, 2023, 11:40 IST
ప్రస్తుతం బిగ్​బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్‌ నడుస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ కుటుంబ...
10-11-2023
Nov 10, 2023, 09:38 IST
ఈ మధ్య నీ ఆట చూసి కొంచెం ఫీలయ్యా. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్‌ నాకు మళ్లీ కావాలి. నీ...
10-11-2023
Nov 10, 2023, 07:52 IST
బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇనయా సుల్తానా.. టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మతో ఒక పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించి భారీగా... 

Read also in:
Back to Top