
రతిక రోస్ అచ్చ తెలుగమ్మాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ముందుగా మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో నటించింది. నేను స్టూడెంట్ సర్ చిత్రంలో పోలీసాఫీసర్‌గా మెప్పించింది. ఎన్ని సినిమాలు చేసినా గుర్తుంపు రావట్లేదని బాధపడుతోంది బ్యూటీ.
ముందు తనకంటూ క్రేజ్ ఉండాలని గుర్తించిన బ్యూటీ బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. చమ్కీల అంగీలేసి పాటకు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో స్వీట్ స్టెప్పులేసింది రతిక. తనకు హార్ట్ బ్రేక్ అయిందంటున్న రతిక కోసం నాగార్జున ఓ హార్ట్ తెప్పించి మరీ తన చేతికిచ్చాడు. మరి ఈ అమ్మడు ఈ షో ద్వారా ఏ రేంజ్‌లో క్లిక్ అవుతుందో చూడాలి!