Bigg Boss 6 Telugu: బాలాదిత్య, వాసంతి ఎన్ని లక్షల పారితోషికం తీసుకున్నారంటే?

Bigg Boss Telugu 6: Baladitya, Vasanthi Krishnan Takes Huge Remuneration - Sakshi

ఎప్పుడైతే బిగ్‌బాస్‌ గేట్లు ఎత్తాడో అప్పటినుంచి షో కాస్త ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆమాత్రం కోపం చూపించకపోయుంటే కంటెస్టెంట్లలో ఈ మాత్రం ఫైర్‌ కూడా ఉండేది కాదు. కానీ షో మొదలై పది వారాలు కావస్తున్నా ఇప్పటికీ తుప్పాస్‌ కారణాలతో నామినేట్‌ చేసుకుంటూనే ఉన్నారు. అలా కొందరు సిల్లీ రీజన్స్‌తో నామినేషన్‌లోకి రావడం, ఎలిమినేట్‌ కావడమూ చకచకా జరిగిపోయాయి. ఇకపోతే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ దెబ్బకు బాలాదిత్య, వాసంతి ఇద్దరూ హౌస్‌ను వీడారు. అయితే ఏమాత్రం నెగెటివిటీ లేకుండా బయటకు రావడం విశేషమనే చెప్పాలి.

కాగా వీరికి పది వారాలకుగానూకి ఎంత పారితోషికం ముట్టింది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బాలాదిత్య పది వారాలకుగానూ రూ. 6.5 లక్షలు తీసుకున్నాడట. బాలనటుడిగా కెరీర్‌ మొదలుపెట్టి సినిమాల్లో, సీరియల్స్‌లో నటుడిగా రాణించి గుర్తింపు తెచ్చుకున్న అతడికి ఆ మాత్రం పారితోషికం ఇవ్వడంలో తప్పేం లేదంటున్నారు అభిమానులు.

ఇకపోతే వాసంతి హౌస్‌కు వచ్చేవరకు ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. షో ద్వారా పాపులారిటీ సంపాదించుకోవాలనుకుంది. అన్నట్లుగానే తన అందంతో అందరినీ పడేసింది. పదివారాలకు ఆమె దాదాపు మూడు లక్షలకు అటూఇటుగా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్‌బాస్‌ టీమ్‌ ఆమెకు వారానికి పాతికవేల నుంచి ముప్పై వేల వరకు లెక్క సెట్‌ చేసినట్లు సమాచారం.

చదవండి: ఆ ఇద్దరే టార్గెట్‌, నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
ప్రేమకు కండీషన్స్‌ పెట్టారు, సూసైడ్‌ అటెంప్ట్‌ చేశా: ఆర్జే సూర్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top