బిగ్‌బాస్‌: యాంకర్‌ రవి పారితోషికం ఎంతో తెలుసా? | Bigg Boss Telugu 5: Anchor Ravi Whopping Remuneration For Bigg Boss | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఒక్క వారానికే రవి అంత తీసుకుంటున్నాడా?

Sep 8 2021 9:28 PM | Updated on Sep 8 2021 9:57 PM

Bigg Boss Telugu 5: Anchor Ravi Whopping Remuneration For Bigg Boss - Sakshi

Anchor Ravi Remuneration for Bigg Boss Telugu 5: యాంకర్‌ రవి.. మోస్ట్‌ వాంటెడ్‌ యాంకర్లలో ఈయన ఒకరు. తన కామెడీతో, పంచులతో టీవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఇతడు తాజాగా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో అడుగు పెట్టాడు. నిజానికి అతడికిప్పటికే కావాల్సినంత పాపులారిటీ ఉంది. చేతినిండా సంపాదించుకునే సత్తా ఉంది. మరి అతడెందుకు షోలో పాల్గొన్నాడనుకుంటున్నారా? దానికి కూడా అతడు స్టేజీ మీదే సమాధానమిచ్చాడు. ఇప్పటివరకు తనను యాంకర్‌ రవిగానే చూశారే తప్ప రవికిరణ్‌గా చూడలేదని, తన వ్యక్తిత్వం, వైఖరిని ప్రజలకు చూపించేందుకే బిగ్‌బాస్‌కు వచ్చానన్నాడు రవి.

అయితే బిగ్‌బాస్‌ కోసం తను చేస్తున్న షోలతో పాటు ఒప్పుకున్న ప్రాజెక్టులను కూడా మధ్యలోనే వదిలేసి వచ్చాడీ యాంకర్‌. మరి అతడికి బిగ్‌బాస్‌ ఎంత ముట్టజెప్పుతుందనుకుంటున్నారు? ఒక్క వారానికి సుమారు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట! యాంకర్‌ రవికున్న క్రేజ్‌ దృష్ట్యా అతడికి ఐదు లక్షలు ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదంటున్నారు అభిమానులు. ఇక భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న యాంకర్‌ రవి ఫినాలే వరకు చేరుకునే సత్తా ఉ‍న్నవాడు. ఒకవేళ అతడు నిజంగానే ఫినాలేకు చేరుకుంటే కేవలం రెమ్యునరేషన్‌ రూపంలోనే అరకోటికి పైగా అందుకునే అవకాశం ఉంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ డోస్‌ పెంచితే ఈ పారితోషికాన్ని పెంచే ఆస్కారమూ లేకపోలేదు!

Advertisement
 
Advertisement
Advertisement