కృష్ణుడిలాంటి భ‌ర్త కావాలి: మోనాల్‌ | Bigg Boss Telugu 4: Monal Gajjar Special Interview | Sakshi
Sakshi News home page

ఆ పాట పాడుతూ ప్ర‌పోజ్ చేయాలి: మోనాల్‌

Dec 16 2020 9:49 PM | Updated on Dec 17 2020 3:50 AM

Bigg Boss Telugu 4: Monal Gajjar Special Interview - Sakshi

గుజ‌రాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్ ఈ మ‌ధ్యే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో లేదో వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారింది. ఈ క్ర‌మంలో సాక్షి గ‌రం గ‌రం వార్త‌లులో పాల్గొన్న ఆమె ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. నాగార్జున గారితో సినిమా చేయాల‌నుందన్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కో మంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని సంతోషం వ్య‌క్తం చేసింది. త‌న‌కు తెలుగు ప్రాబ్ల‌మ్ ఉంది కానీ తెలివి ప్రాబ్ల‌మ్ లేద‌ని చెప్పింది. ఎప్ప‌టికైనా హైద‌రాబాద్‌లో ఇల్లు కొంటానంటోంది. మ‌రి మోనాల్ ఇంకా ఏమేం ముచ్చ‌టించిందో ఆమె మాటల్లోనే..

సంతోష‌మొచ్చినా, బాధేసినా ఏడుస్తాను. పైగా బిగ్‌బాస్ హౌస్‌లో చాలా ఒత్తిడి ఉండేది. నాకు తెలుగు స‌రిగా రాక‌పోవ‌డం వ‌ల్ల‌‌ మొద‌టి వారం ఎలిమినేష‌న్ నుంచే దివితో అపార్థాలు మొద‌ల‌య్యాయి. భాషా స‌మ‌స్య‌ క్లియ‌ర్ చేసుకుందామ‌నుకున్న ప్ర‌తిసారి అవి మ‌రింత పెరిగేవి. అందుకే న‌న్ను త‌ప్పుప‌డుతున్నా కూడా నేను ఏం స్పందించ‌కుండా ఉండాల‌ని నిశ్చ‌యించుకున్నా. అలా రిప్లై ఇవ్వ‌డం మానేశాను. (మోనాల్ లేక‌పోతే పిచ్చి లేస్తుంది: అఖిల్‌)

అఖిల్‌, అభిజిత్‌, నేను ముందు నుంచీ ఫ్రెండ్స్‌. ఫ్రెండ్‌షిప్‌లో న‌మ్మ‌కం త‌ప్ప‌నిస‌రి. కానీ ప‌రిస్థితులు మారేకొద్దీ అభికి నా మీద న‌మ్మ‌కం పోయింది. ఈ విష‌యంలో కొంచెం హ‌ర్ట‌య్యాను. కానీ నాకు  అఖిల్ బెస్ట్‌ఫ్రెండ్‌గా ఉన్నందుకు సంతోషంగా ఫీల‌య్యా. అఖిల్‌తో పాటు హారిక‌, సోహైల్ నా ఫేవ‌రెట్‌. నా పెళ్లికి ఇంకా టైముంది. కానీ ప్రేమ పెళ్లా, అరేంజ్డ్ మ్యారేజా అనేది నా చేతుల్లో లేదు. ఒక‌వేళ న‌న్నెవ‌రైనా ప్రేమిస్తే మాత్రం నీకేం కావాలి చెప్పు.. సాంగ్ పాడుతూ నాకు ప్ర‌పోజ్ చేయాలి. నాకు మాత్రం కృష్ణుడిలాంటి భ‌ర్త కావాలి. ఇక‌పోతే ఎప్ప‌టికైనా హైద‌రాబాద్‌లో ఒక ఇల్లు కొనాలి. కానీ దానికింకా స‌మ‌యం ప‌డుతుంది అని మోనాల్ చెప్పుకొచ్చింది. (మోనాల్ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement