మోనాల్‌కు ల‌క్ష‌లు కురిపించిన బిగ్‌బాస్‌ | Bigg Boss 4 Telugu: Monal Gajjar Remuneration For 14 Weeks | Sakshi
Sakshi News home page

మోనాల్ రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే?

Dec 15 2020 7:32 PM | Updated on Dec 15 2020 7:37 PM

Bigg Boss 4 Telugu: Monal Gajjar Remuneration For 14 Weeks - Sakshi

చూస్తుండ‌గానే బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ అంతిమ ఘ‌ట్టానికి చేరుకుంది. హౌస్‌లో మొద‌ట అడుగు పెట్టిన మోనాల్ గ‌జ్జ‌ర్ ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయి బిగ్‌బాస్ షో నుంచి నిష్క్ర‌మించింది. సంతోషాలు, స్నేహాలు, బాధ‌లు, బంధాలు అన్నింటినీ రుచి చూసిన‌ ఆమె ప‌ద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయంది. కాగా మోనాల్ షో ప్రీమియ‌ర్ ఎపిసోడ్ నాడు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేవాళ్ల‌కు మంచి నీళ్లు ఇస్తూ ముందుగానే మంచిపేరు కొట్టేసింది. త‌ర్వాత అఖిల్‌, అభిజిత్‌తో క్లోజ్ అవుతూ కెమెరాల‌ను త‌న వైపు తిప్పుకుంది. (చ‌ద‌వండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి)

బెడిసి కొట్టిన ట్ర‌యాంగిల్ స్టోరీ
కానీ ఈ ట్ర‌యాంగిల్ స్టోరీ జ‌నాల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. అటు హౌస్‌లో కూడా బెడిసి కొట్టింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిపోయిన ఆమె చివ‌ర‌కు ఏకాకిగా మిగిలింది. టాస్కులు స‌రిగా ఆడ‌దంటూ ఇంటి స‌భ్యులు ఆమెను ప‌దేప‌దే నామినేట్ చేసేవారు. దీంతో త‌ను కూడా ఆడ‌తాను అని నిరూపించుకోలేక మోనాల్ లోలోప‌లే కుమిలిపోయేది. అయితే ఎన్నోసార్లు కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన హారిక‌ను కెప్టెన్ చేసి ఆమె అంద‌రి నోళ్లు మూయించింది. ఆ త‌ర్వాత కూడా టాస్కుల్లో స‌త్తా చూపుతూ వ‌చ్చిన ఆమె మొన్న‌టి ఆదివారం ఎలిమినేట్ అయింది. (చ‌ద‌వండి: మోనాల్ మ‌న‌సులో నేనున్నా అంది: అభి)

రూ.35 ల‌క్ష‌ల పైనే అందుకున్న మోనాల్‌
ఈ క్ర‌మంలో మోనాల్ రెమ్యూన‌రేష‌న్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఆమెకు వారానికి  రెండున్న‌ర ల‌క్ష‌ల పైచిలుకు పారితోషికం అందించార‌ట‌‌. అంటే మొత్తం ప‌ద్నాలుగు వారాలకు క‌లిపి మోనాల్ రూ.35 ల‌క్ష‌ల‌కు పైనే ముట్టిన‌ట్లు తెలుస్తోంది.మ‌రికొంద‌రేమో ఏకంగా బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీతో స‌మానంగా రూ.49 ల‌క్ష‌లు అందుకున్నార‌ని అంటున్నారు. ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలీదు కానీ సోష‌ల్ మీడియాలో ఆమె రెమ్యూన‌రేష‌న్ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement