బిగ్‌బాస్ శివజ్యోతి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే? | Bigg Boss Siva Jyothi Daughter naming Ceremony | Sakshi
Sakshi News home page

Siva Jyothi: గ్రాండ్‌గా శివజ్యోతి కూతురి నామకరణ వేడుక.. ఏ పేరు పెట్టారంటే?

May 7 2026 8:02 PM | Updated on May 7 2026 8:18 PM

Bigg Boss Siva Jyothi Daughter naming Ceremony

బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి పేరు అందరికీ సుపరిచితమే.  ఈ ఏడాది ప్రారంభంలోనే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫిబ్రవరి 12న తనకు పండంటి బిడ్డ పుట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తనకు కూతురు పుట్టిందని జెండర్ రివీల్ చేసింది. ఈ ఏడాది ఆమెకు మరింత స్పెషల్‌గా మారిందని ఆనందం వ్యక్తం చేసింది. ఇటీవలే మ్యారేజ్ యానివర్సరీ చేసుకున్న శివ ‍జ్యోతి.. తాజాగా మరో వేడుక నిర్వహించింది. 

తాజాగా తన ముద్దుల కూతురి నామకరణ వేడుక గ్రాండ్‌గా నిర్వహించింది. తమ గారాల పట్టికి వెన్నెల అని పేరు పెట్టింది. ఈ వేడుకకు  సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మా వెన్నెల చుట్టాలు అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకలో టాలీవుడ్ బుల్లితెర సినీతారలు హాజరై సందడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement