ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. సోషల్ మీడియాలో పోస్ట్‌ వైరల్! | Bigg Boss Season 10 Tv Actress Gets Hospitalised | Sakshi
Sakshi News home page

Bigg Boss: ఆస్పత్రిలో చేరిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్‌ వైరల్!

Jun 7 2024 9:34 PM | Updated on Jun 7 2024 9:35 PM

Bigg Boss Season 10 Tv Actress Gets Hospitalised

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌- 10 ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కన్నడ నటి నమ్రత గౌడ. తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నమ్రత గౌడ తన ఇన్‌స్టాలో రాస్తూ.. " ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ప్రస్తుతానికి నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. నా కోసం ప్రార్థించిన  అందరికీ ధన్యవాదాలు" అని రాసింది. కాగా.. నమ్రత ఆసుపత్రి బెడ్‌పై ఉండగా.. తన తల్లి ఆహారం తినిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది. కన్నడ టీవీ సీరియల్ షో నాగినిలో శివాని పాత్ర పోషించినందుకు నమ్రత గౌడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ టెలివిజన్ పరిశ్రమలో 2011లో 'కృష్ణ రుక్మిణి' అనే సీరియల్‌తో ఆమె కెరీర్ ప్రారంభించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement