Bigg Boss Fame Priyanka Singh Shares Pics In Instagram; Netizens Trolled - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ నటి ప్రియాంక సింగ్ పోస్ట్ .. సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్!

Apr 12 2023 8:09 AM | Updated on Apr 12 2023 12:32 PM

Bigg Boss Priyanka Singh Shares Pics In Instagram Netizens Trolled - Sakshi

బుల్లితెర నటి ప్రియాంక సింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్‌ సీజన్‌-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్‌ హౌస్‌లో 13 వారాలు ఉండి మెప్పించింది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌లో టాప్‌-7లో నిలిచింది. ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. 

ప్రియాంకా సింగ్ జబర్దస్త్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను అలరించింది. కొన్నాళ్లకు బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ షో తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పింకీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా పింకీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాటిలో ఒక ఫోటోను వెంటనే డిలీట్ చేసిందామె. అయినప్పటికీ ఆమె ఫోటోను డౌన్‌లోడ్‌ చేశామంటూ ప్రియాంక సింగ్‌కు షాకిచ్చారు నెటిజన్స్. పోస్ట్ చేసేముందుకు కాస్తా ఆలోచించాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు డిలీట్ చేసి ఏ లాభం.. మేము ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్నాం.' అంటూ పోస్ట్ చేస్తున్నారు. 

 

ప్రియాంక తన్‌ ఇన్‌స్టాలో రాస్తూ..'నేను యాటిట్యూడ్‌తో పుట్టలేదు.. కానీ నా జీవితంలో ఎదగడానికి మంచి దృక్పథం ఉంది. కొన్నిసార్లు నా కళ్లు కూడా అలా మాట్లాడతాయి. ఇది నా జీవిత గమనాన్ని చెబుతుంది.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దారుణమైన ఫోటోలు పెట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటితో నీకిచ్చే విలువ కూడా తగ్గిపోయిందంటూ ఫైర్ అవుతున్నారు. అయితే మరి కొందరేమో ప్రియాంక సింగ్‌కు మద్దతుగా  నిలుస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement