'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా? | Bigg Boss Telugu OTT Season 2 Cancelled; Here Reasons - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: 'బిగ్‌బాస్' షోకి కొత్త కష్టాలు.. మరీ ఇంత దారుణమా?

Published Tue, Jan 30 2024 6:40 PM

Bigg Boss OTT Telugu Latest Season Cancelled - Sakshi

బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మొన్నీమధ్యే డిసెంబరులో ఏడో సీజన్ పూర్తయింది. ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం.. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. ఇలా ఎంత జరగాలో అంతా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఓటీటీ సీజన్ ఉందన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అది రద్దయినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏమైంది? రద్దుకు కారణమేంటి?

తెలుగులో బిగ్‌బాస్ షో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది. షో ఆపేయాలని విమర్శలు.. కోర్టు కేసులు.. ఇలా ప్రతిసారి రచ్చ అవుతూనే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా సరే షోని ఆపట్లేదు సరికదా ఓటీటీ సీజన్ కూడా ఆ మధ్యలో ఒకటి పెట్టారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు పాల్గొన్న ఆ సీజన్‌లో బింధుమాధవి విన్నర్‍‌గా నిలిచింది. కాకపోతే ఆ సీజన్ ఫెయిలైంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?)

అయితే రీసెంట్‌గా జరిగిన ఏడో సీజన్.. విమర్శల కారణంగా వార్తల్లో నిలిచింది. దీన్ని క్యాష్ చేసుకుందామని నిర్వహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఫిబ్రవరిలో తొలి వారంలో ఓటీటీ సీజన్ మొదలుపెట్టేయాలని అనుకున్నారు. ఏడో సీజన్‌లో పాల్గొన్న భోలె షావళి, నయన పావని తోపాటు యావర్ కూడా ఈ సీజన్‌లో పాల్గొంటారని రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు తప్పితే మిగతా వాళ్లు ఎవరూ దీనిపై కనీస ఆసక్తి చూపించట్లేదట.

టీవీ సీజన్ అయితే వస్తాం గానీ ఓటీటీ సీజన్‌కి మాత్రం వచ్చేది లేదని చెబుతున్నారట. రెమ్యునరేషన్ పెంచి ఇస్తామని చెప్పినా సరే పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. మరోవైపు నాగార్జున కూడా అందుబాటులో ఉండట్లేదు. దీంతో హోస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా సమస్యలు ఎక్కువయ్యేసరికి నిర్వహకులు.. సీజన్‌ని రద్దు చేయాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

Advertisement
 
Advertisement