ప్రశాంత్ అమాయకుడు.. అసలు జైల్లో వేయడమేంటి?: అశ్విని ఎమోషనల్ | Sakshi
Sakshi News home page

Bigg Boss Ashwini: పాపం.. ప్రశాంత్ ఏం చేశాడండి.. చాలా బాధగా ఉంది: అశ్విని

Published Thu, Dec 21 2023 7:23 PM

Bigg Boss Contestant Ashwini Emotional About Pallavi Prashanth Arrest - Sakshi

రైతుబిడ్డగా బిగ్‌బాస్‌ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్‌దీప్‌ రన్నరప్‌గా నిలిచాడు. ‍అయితే అంతవరకు బాగానే ఉన్నా.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్యాన్స్ చేసిన హంగామాతో అమర్‌దీప్‌, అశ్విని, గీతూరాయల్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ‍

(ఇది చదవండి: భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

అయితే తాజాగా పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌పై మరో కంటెస్టెంట్ అశ్విని స్పందించారు. పల్లవి ప్రశాంత్‌ అమాయకుడని అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచిన సంతోషం లేకుండా చేశారని అన్నారు. నాకు ప్రశాంత్ తమ్ముడిలాంటి వాడు.. అతను త్వరలోనే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నట్లు అశ్విని బాధపడ్డారు. అది ఫ్యాన్స్ చేసిన తప్పే కానీ.. ప్రశాంత్ అలాంటివాడు కాదని తెలంగాణ పోలీసులను కోరింది. 

అశ్విని మాట్లాడుతూ.. 'పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదండి. ఓ కామన్‌ మ్యాన్‌గా వచ్చి ట్రోఫీ గెలిచాడు. పాపం.. ప్రశాంత్ ఏం చేశాడండి. అతన్ని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఫ్యాన్స్ వచ్చారు. అతన్ని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ప్రశాంత్ చాలా అమాయకుడు, మంచి వ్యక్తి కూడా. కప్ గెలిచి ఒక్కరోజు కూడా కాలేదు. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైల్లో వేశారంటనే చాలా బాధగా ఉంది. అతను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రశాంత్‌కు సపోర్ట్ చేయండి. అది అతని తప్పుకాదని తెలంగాణ పోలీసులకు విజ్ఞుప్తి చేస్తున్నా' అంటూ ప్రశాంత్‌కు మద్దతుగా నిలిచారు. కాగా.. స్టూడియో బయట జరిగిన గొడవలో అశ్విని కారు అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ!)

Advertisement
 
Advertisement
 
Advertisement