సినిమాలు, సిరీస్‌లతో అర్జున్‌ కల్యాణ్‌ బిజీబిజీ! | Bigg Boss Contestant Arjun Kalyan Busy With Multiple Projects | Sakshi
Sakshi News home page

Arjun Kalyan: అర్జున్ కల్యాణ్‌ నటించిన సినిమాలేంటో తెలుసా?

Published Fri, Dec 2 2022 7:05 PM | Last Updated on Fri, Dec 2 2022 9:17 PM

Bigg Boss Contestant Arjun Kalyan Busy With Multiple Projects - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో అడుగుపెట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో అర్జున్ కల్యాణ్ ఒకరు. అయితే ఆటకు అదృష్టం కూడా తోడైతేనే హౌస్‌లో ఉండగలరు. ఈ రెండూ అతడికి కలిసి రాకపోవడంతో ఏడో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యాడు అర్జున్‌. ఒకసారి అతడి నేపథ్యం ఏంటో చూసేద్దాం..

అర్జున్ కల్యాణ్‌ అమెరికాలో మాస్టర్స్ చేసి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలింతో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమమ్, వరుడు కావలి, ప్లే బాక్ వంటి సినిమాలలో అర్జున్ చేసిన పాత్రలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి వంటి వెబ్ సిరీస్‌లతో మరింత ఆదరణ లభించింది.

ప్రస్తుతం అతడు మాటే మంత్రము, బాబు -  నెంబర్ 1 బుల్ షిట్ గయ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే మరో సినిమాతో పాటు ఓ వెబ్‌సిరీస్‌ చర్చల దశలో ఉంది. ఇలా నటుడిగా ఆదరణ పొందుతున్న సమయంలో బిగ్‌బాస్‌ షో అర్జున్‌ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ షోలో తనను ఎంతగానో ఆదరించిన ఆడియన్స్‌ మున్ముందు తాను చేసే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాడు అర్జున్.

చదవండి: మచ్చలేని మనిషి.. రోహిత్‌కు దండాలు పెడుతున్న ఆడియన్స్‌
ప్రముఖ నటి కన్నుమూత, రాష్ట్రపతి సంతాపం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement